ఏడుగుర్ని కాల్చి చంపిన రష్యన్ సైన్యం

ABN , First Publish Date - 2022-04-13T23:03:06+05:30 IST

దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యన్ సైనికులు ఏడుగురు పౌరుల్ని కాల్చి చంపారు. మరణించిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.

ఏడుగుర్ని కాల్చి చంపిన రష్యన్ సైన్యం

దక్షిణ ఉక్రెయిన్‌లో రష్యన్ సైనికులు ఏడుగురు పౌరుల్ని కాల్చి చంపారు. మరణించిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. మంగళవారం రష్యన్ సైన్యం ఒక నివాస ప్రాంతంలోకి చొరబడి ఈ కాల్పులకు తెగబడిందని ఉక్రెయిన్ తెలిపింది. సాధారణ పౌరుల్ని కాల్చి చంపిన తర్వాత ఆధారాలు కనిపించకుండా, శవాలు ఉన్న బిల్డింగ్‌ను రష్యన్ సైన్యం పేల్చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మరోవైపు దాదాపు 1,500 మందికి పైగా రష్యన్ సైనికుల్ని ఉక్రెయిన్‌లోని డిప్రో నగరంలో ఆధీనంలో ఉంచినట్లు అక్కడి మేయర్ చెప్పారు. రష్యా తమ దేశంలో తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

Updated Date - 2022-04-13T23:03:06+05:30 IST