ఉక్రెయిన్‌ మహిళలకు రష్యా సైనికుల రొమాంటిక్ సందేశాలు

ABN , First Publish Date - 2022-02-24T22:49:06+05:30 IST

కొంత మంది తుపాకులు చూపిస్తూ ఇబ్బందికరమైన సందేశాలు పంపిస్తున్నారనే ఫిర్యాదులు కూడా పెరిగాయి. వీటికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన మరొక..

ఉక్రెయిన్‌ మహిళలకు రష్యా సైనికుల రొమాంటిక్ సందేశాలు

మాస్కో: ఒకవైపు ఉక్రెయిన్‌పై బాంబులు కురిపిస్తూ దండయాత్ర చేస్తున్న రష్యా సైనికులు.. మరొకవైపు ఉక్రెయిన్ మహిళలకు సరస సందేశాలు పంపుతున్నారు. వారిని కలవాలని ఉందంటూ టిండర్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. కొంత మంది ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేసి శృంగారపరమైన సందేశాలు కూడా పంపుతున్నట్లు ఉక్రెయిన్ మహిళలు చెబుతున్నారు. కుప్పలకొద్ది వస్తున్న సందేశాలకు సమాధానం ఇవ్వలేక, ప్రొఫైల్ మార్చడమో, లొకేషన్ మార్చడమో లాంటివి చేస్తున్నారట.


ఆండ్రీ, అలెగ్జాండర్, గ్రీజరీ, మైఖేల్.. ఇలా అనేక మంది రష్యన్ సైనికులు ప్రస్తుతం టిండర్‌లో ఉక్రెయిన్ అమ్మాయిలను వల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఒక మహిళ ఈ విషయమై మాట్లాడుతూ ‘‘కండలు తిరిగిన ఒక రష్యా సైనికుడు నన్ను కలవాలని సందేశాలు పంపుతున్నాడు. కానీ నా శత్రువుతో నేను ఎలా ముందుకెళ్లను. అలా అని వాళ్లను నిలువరించలేకపోతున్నాను. వందల సందేశాలు వస్తున్నాయి. అందుకే నా ప్రొఫైల్ మార్చేశాను’’ అని తెలిపారు.


కొంత మంది తుపాకులు చూపిస్తూ ఇబ్బందికరమైన సందేశాలు పంపిస్తున్నారనే ఫిర్యాదులు కూడా పెరిగాయి. వీటికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన మరొక వ్యక్తి స్పందిస్తూ ‘‘టిండర్‌లో వీళ్లు కూడా అందరి లాంటి వారే. వాళ్లకు ప్రేమనో, సాంగత్యమో కావాలి. ఒకవైపు మాపై దండయాత్ర చేస్తూ మరొకవైపు ప్రేమాయాణ సందేశాలు పంపడాన్ని ఊహించలేకపోతున్నాం. కానీ వాల్లు ఊహించేది జరగదు అని మాత్రం అనుకుంటున్నాను’’ అని అన్నారు.

Read more