బయటివారు జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటాం...వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-02-24T15:05:43+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై సైనిక ఆపరేషన్ విషయంలో బయటి దేశాల వారెవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు....

బయటివారు జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటాం...వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిక

మాస్కో : ఉక్రెయిన్ దేశంపై సైనిక ఆపరేషన్ విషయంలో బయటి దేశాల వారెవరూ జోక్యం చేసుకోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు. ఈ సైనిక చర్యలో జోక్యం చేసుకునే వారిపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై దండయాత్రకు ఆదేశించిన పుతిన్ గురువారం టెలివిజన్‌లో ప్రసంగించారు.ఉక్రెయిన్ నుంచి వచ్చిన బెదిరింపులకు ప్రతిస్పందనగా తాము దాడులు చేస్తునట్లు పుతిన్ చెప్పారు.ఉక్రెయిన్ దేశంలో సైనికీకరణ నిర్వీర్వీకరణ లక్ష్యంగా తాము సైనిక చర్య ప్రారంభించామని రష్యా అధ్యక్షుడు టీవీ ప్రసంగంలో పేర్కొన్నారు.రష్యా  ఉక్రేనియన్ దళాల మధ్య ఘర్షణలు అనివార్యం అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. 


ఉక్రేనియన్ సైనికులు తమ ఆయుధాలు వదిలి ఇంటికి వెళ్లాలని పుతిన్ పిలుపునిచ్చారు.‘‘ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకుంటే, అన్నిటికంటే తీవ్ర పరిణామాలను మీరు ఎదుర్కొంటారు.’’ అని పుతిన్ హెచ్చరించారు.ఉక్రెయిన్‌ను నాటోలో చేరకుండా ఆపాలన్న రష్యా డిమాండ్‌ను అమెరికా, దాని మిత్రదేశాలు విస్మరించాయని ఆయన ఆరోపించారు.ఉక్రెయిన్‌లో రష్యా చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.పుతిన్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పందించారు. ‘‘ఈ విధ్వంసానికి రష్యా మాత్రమే బాధ్యత వహిస్తుంది. అమెరికా, దాని మిత్రదేశాలు ఐక్యంగా నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి. ప్రపంచం రష్యాను జవాబుదారీగా చేస్తుంది’’ అని జో బిడెన్  అన్నారు.


Read more