కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా

ABN , First Publish Date - 2022-03-05T18:37:48+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా కాసేపు కాల్పుల విరమణను

కాల్పుల విరమణను ప్రకటించిన రష్యా

మాస్కో : ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా కాసేపు కాల్పుల విరమణను ప్రకటించింది. రెండు నగరాల్లో మానవతావాద సాయం అందజేయడానికి వీలుగా శనివారం తాత్కాలికంగా కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాస్కో స్థానిక సమయం ప్రకారం మార్చి 5న ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని తెలిపింది. మరియుపోల్, వోల్నోవాకా నగరాల నుంచి సాధారణ ప్రజలు బయటకు వెళ్ళటానికి వీలుగా మానవాతావాద నడవ (కారిడార్)లను తెరుస్తున్నట్లు తెలిపింది. 

మరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత కొద్ది రోజుల నుంచి విద్యుత్తు, తాగునీరు, ఆహారం, హీటింగ్, రవాణా సదుపాయాలను రష్యా దళాలు నిలిపేశాయి. రెండో ప్రపంచ యుద్ధంలో లెనిన్‌గ్రాడ్‌ను నాజీ దళాలు దిగ్బంధించిన రోజులు గుర్తుకొచ్చాయి. 


రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ సుమారు ఐదున్నర గంటలపాటు అమలవుతుందని తెలుస్తోంది. 


Updated Date - 2022-03-05T18:37:48+05:30 IST