Russia Annexation Of Occupied Ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం

ABN , First Publish Date - 2022-10-01T03:55:27+05:30 IST

క్రెమ్లిన్: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో తాము ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించారు.

Russia Annexation Of Occupied Ukraine: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం

క్రెమ్లిన్: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో తాము ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా ప్రకటించారు. ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, దొనేట్స్క్ ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు క్రెమ్లిన్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ఈ ప్రాంతాలను విలీనం చేసుకున్నామంటూ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నాలుగు ప్రాంతాలు కలిపితే సుమారు 15 శాతం భూభాగం రష్యా వశమైనట్లైంది.


ఇదే సమయంలో పుతిన్ పశ్చిమదేశాలపై విరుచుకుపడ్డారు. మధ్యయుగంలో వలసవాదంతో బానిసలుగా చేసుకుని వ్యాపారం చేశారని పశ్చిమదేశాల విధానాలను విమర్శించారు. భారత గిరిజన జాతులను ఊచకోత కోశారని, భారత్‌ను, ఆఫ్రికాను దోచుకున్నారని యూరోపియన్ దేశాల తీరును ఘాటుగా విమర్శించారు. పశ్చిమదేశాధినేతలు ప్రస్తుతం అన్ని దేశాలనూ డ్రగ్స్‌లో ముంచేశారని, జాతులను సమూలంగా నాశనం చేస్తున్నారని పుతిన్ విమర్శలు గుప్పించారు. భూముల కోసం, వనరుల కోసం ప్రజలను జంతువుల్లా వెంటాడారని మండిపడ్డారు. మానవత్వం, స్వేచ్ఛ, న్యాయం, ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారని పుతిన్ ఆరోపించారు. చివరగా చర్చలకు రావాలని పుతిన్ ఉక్రెయిన్‌కు పిలుపునిచ్చారు. 

  


అయితే రష్యాలో పుతిన్ ఉన్నంతవరకూ తాము చర్చలు జరపబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అంతేకాదు నాటో కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటున్నామన్నారు. 

Read more