Goa నుంచి Hyderabad వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

ABN , First Publish Date - 2022-06-03T17:17:46+05:30 IST

కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Goa నుంచి Hyderabad వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

కర్ణాటక/హైదరాబాద్: కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా, కమలాపురం (Kamalapuram) సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణీకులు మృతి చెందారు. లారీని ఢీకొన్న తర్వాత బస్సు బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న నలుగురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. 12 మందిని స్థానికులు కాపాడారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-06-03T17:17:46+05:30 IST