రాజస్థాన్‌లో మైనర్‌పై అత్యాచారం.. నెల రోజులపాటు..

ABN , First Publish Date - 2022-06-05T21:27:49+05:30 IST

వయసు భేదం లేకుండా మహిళలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచారాలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.

రాజస్థాన్‌లో మైనర్‌పై అత్యాచారం.. నెల రోజులపాటు..

భరత్‌పూర్, రాజస్థాన్ : వయసు భేదం లేకుండా మహిళలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచారాలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఇటివల హైదరాబాద్‌లో మైనర్ బాలికపై రేప్ కేసు ఉదంతం మరువక ముందే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నెల రోజులుగా ఈ దుశ్చర్యను కొనసాగించారు. బాధితురాలికి ప్రెగ్నెన్సీ రాకుండా బలవంతంగా గర్భనిరోధక మాత్రలు ఇచ్చారు. బాలికపై దారుణాన్ని వీడియో చిత్రీకరించిన నిందితులు విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాలికను బెదిరించారు. భయపడిపోయిన బాలిక ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేకపోయింది.


అసలేం జరిగిందంటే..

భరత్‌పూర్‌లో రెస్టారెంట్ నడుపుతున్న మహావీర్ సైనీ అనే వ్యక్తి మరో ఇద్దరి సహాయంతో బాలిక తన రెస్టారెంట్‌కు వచ్చేలా చేశాడు. పథకం ప్రకారం.. మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌‌ను ఆమె చేత తాగించారు. బాలిక మత్తులోకి జారుకోగానే ఒకరి తర్వాత ఒకరు వంతులవారీగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యను నిందితులు వీడియో తీశారు. ఎవరికైనా చెబితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని, చంపేస్తామని బాలికను బెదిరించారు. బలవంతంగా గర్భనిరోధక మాత్రలు కూడా వేశారు. ఈ విధంగా నెల రోజులపాటు బాలికపై అఘాయిత్యాన్ని కొనసాగించారు. కాగా బాలిక ప్రవర్తనలో మార్పులను గమనించిన తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం జరిగినట్టు మెడికల్ ఎగ్జామినేషన్‌లో కూడా నిర్ధారణ అయ్యింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లతోపాటు పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడికి త్రివేది సైనీ అనే వ్యక్తి సహకరించాడని, ఇద్దరినీ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు.

Updated Date - 2022-06-05T21:27:49+05:30 IST