lightning strikes: పిడుగుపాటుకు ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2022-09-12T14:20:01+05:30 IST

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో మరోసారి పిడుగులు(lightning strikes) పడ్డాయి...

lightning strikes: పిడుగుపాటుకు ఏడుగురి మృతి

మరో నలుగురికి గాయాలు

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో మరోసారి పిడుగులు(lightning strikes) పడ్డాయి.జాల్వార్, ఉదయపూర్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఏడుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్, బార్మేర్, దుగార్ పూర్, బుండీ, అజ్మీర్, ఫలోది, బికనేర్ ప్రాంతాల్లో భారీవర్షంతోపాటు(heavy rainfall) ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు( lightning) పడ్డాయి. పిడుగుపాటుకు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.అస్నాపూర్, ఖాన్పూర్, మండవార్, దంగిపురా జిల్లాల్లో పిడుగుపాటుకు శనివారం కూడా ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. టోంక్, అల్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, కోట బారన్, జాల్వార్, ఉదయపూర్ జిల్లాల్లో భారీవర్షంతో పాటు భారీ గాలులు వీస్తున్నాయి.బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల భారీవర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రంలో తరచూ పిడుగుపాటుకు జనం మరణిస్తున్నారు. 

Read more