ఢిల్లీని కప్పేసిన పొగమంచు...22 రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-01-20T15:31:50+05:30 IST

గురువారం ఉదయం ఓ మోస్తరు వర్షంతోపాటు పొగమంచు దుప్పటిలా కప్పేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే 22 రైళ్లను రద్దు చేశారు....

ఢిల్లీని కప్పేసిన పొగమంచు...22 రైళ్ల రద్దు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీని పొగమంచు కప్పేసింది.గురువారం ఉదయం ఓ మోస్తరు వర్షంతోపాటు పొగమంచు దుప్పటిలా కప్పేయడంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే 22 రైళ్లను రద్దు చేశారు. పొగమంచు ప్రభావం వల్ల 13 రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి.హౌరా-న్యూఢిల్లీ, పూరి-న్యూఢిల్లీ, కాన్పూర్ న్యూఢిల్లీ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఈశాన్య రైల్వే ప్రజాసంబంధాల శాఖ అధికారి చెప్పారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్ ప్రాంతాల్లో జనవరి 21 నుంచి 23వతేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 


Updated Date - 2022-01-20T15:31:50+05:30 IST