Railway stations: సబర్బన్ రైల్వేస్టేషన్లలో 300 మందితో బందోబస్తు
ABN , First Publish Date - 2022-10-17T17:59:30+05:30 IST
సబర్బన్ రైల్వేస్టేషన్లలో అదనంగా 300 మంది పోలీసులతో భద్రత పెంచనున్నారు. నగరంలో అరకోణం, గుమ్మిడిపూండి
చెన్నై/పెరంబూర్: సబర్బన్ రైల్వేస్టేషన్లలో అదనంగా 300 మంది పోలీసులతో భద్రత పెంచనున్నారు. నగరంలో అరకోణం, గుమ్మిడిపూండి, చెంగల్పట్టు మార్గాల్లో ప్రతిరోజు 450 సబర్బన్ రైళ్లలో లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రైళ్లలో షాపింగ్ చేసేందుకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రధాన రైల్వేస్టేషన్లలో అదనంగా 300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.