ఆ బాధను వర్ణించలేం: sidhu familyని పరామర్శించిన అనంతరం rahul

ABN , First Publish Date - 2022-06-07T21:07:13+05:30 IST

దారుణ హత్యకు గురైన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధు మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మంగళవారం కలుసుకున్నారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో ఉన్న మూసా గ్రామానికి వెళ్లి మూసేవాలా కుటుంబ సభ్యుల్ని..

ఆ బాధను వర్ణించలేం: sidhu familyని పరామర్శించిన అనంతరం rahul

చండీగఢ్: కొద్ది రోజుల క్రితం మరణించిన సింగర్ సిద్ధూ ముసేవాలా తల్లిదండ్రులు పడుతున్న బాధను వర్ణించడం కష్టమని, అయితే వారికి న్యాయం చేయడం తమ కర్తవ్యమని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం ఆయన పంజాబ్‌లోని మూసేవాలా ఇంటికి స్వయంగా వెళ్లి వారి కుటుంబాన్ని కలుసుకుని ఓదార్చారు. రాహుల్‌తో పాటు పంజాబ్ పీసీసీ చీఫ్ అమ్రిందర్ సింగ్ రాజా వారింగ్, విపక్ష నేత పత్రాప్ సింగ్ బజ్వా, మాజీ డిప్యూటీ సీఎం ఓపీ సోని సహా పలువురు కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లారు. సిద్ధు హత్యకు గురైన సమయంలో రాహుల్ ఇండియాలో లేరు. ఈ ఘటన జరిగిన వారం రోజుల అనంతరం ఇండియాకు వచ్చారు. కాగా, పంజాబ్‌లో 400 మందికి పైగా ప్రముఖులకు పంజాబ్ ప్రభుత్వం భద్రతను తొలగించిన మర్నాడే ఈ ఘటన జరిగింది. దీంతో రాజకీయంగా పెద్ద దుమారం లేవడంతో అందరికీ భద్రతను పునరుద్దరించారు.

Updated Date - 2022-06-07T21:07:13+05:30 IST