Congress president poll: ఓటు వేసిన రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-10-17T19:25:31+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న కాంగ్రెస్..

Congress president poll: ఓటు వేసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల (Congress president poll) పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ సహా పార్టీ ప్రముఖులు, ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul gandhi) కర్ణాటకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బళ్లారిలో ఏర్పాటు చేసిన భారత్ జోడో క్యాంప్ సైట్‌లోనే ఆయన ఓటు వేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, జైరామ్ రమేష్ సైతం ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.


ఎలాంటి ఫిర్యాదులు లేవు: మధుసూదన్ మిస్త్రీ

కాగా, పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పట్ల తాను సంతృప్తి చెందినట్టు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతోందని, ఏ రాష్ట్రం నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని చెప్పారు.



Updated Date - 2022-10-17T19:25:31+05:30 IST