Rahul: కన్నియాకుమారి జిల్లాలోనే నాలుగు రోజుల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-08T16:05:12+05:30 IST

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi) కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు చేపట్టిన ‘భారత్‌ జోడో

Rahul: కన్నియాకుమారి జిల్లాలోనే నాలుగు రోజుల పాదయాత్ర

                                - ‘భారత్‌ జోడో’ యాత్ర సాగే తీరిది 


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 7: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ(Rahul Gandhi) కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ బుధవారం సాయంత్రం ప్రారంభమైంది. ఆయన కన్నియాకుమారి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కన్నియాకుమారి సముద్రతీరంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి అగస్తీశ్వరం వరకు ప్రయాణం చేసి రాత్రి ఆ ప్రాంతంలోని వివేకానంద కళాశాలలో బసచేశారు. గురువారం ఉదయం 6 గంటలకు వివేకానంద కళాశాల(Vivekananda College) నుంచి కొట్టారం కామరాజర్‌ విగ్రహం వరకు వెళ్తారు. 7 గంటలకు పోత్తయడి నుంచి వళుక్కమ్‌పారై వరకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మళ్లీ వళుక్కమ్‌పారై జంక్షన్‌ నుంచి సుశీంద్రం ఎస్‌ఎంఎ్‌సఎం పాఠశాల వరకు పాదయాత్రగా వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి సెయింట్‌ జేవియర్‌ చర్చి వరకు పాదయాత్ర చేస్తారు.  ఈ నెల 9వ తేది ఉదయం 6 గంటలకు నాగర్‌కోయిల్‌లోని సెయింట్‌ స్కాట్‌ క్రైస్తవ కళాశాల నుంచి సుంగాడై జంక్షన్‌ వరకు, 6.30 గంటలకు ఈ జంక్షన్‌ నుంచి విల్లుపురి జంక్షన్‌ వరకు, 7 గంటలకు పైగా పులియూర్‌ కురిచ్చి చర్చి వరకు పాదయాత్ర చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మేట్టుకుడి మసీదు వరకు, 4 గంటలకు తక్కల్‌ జంక్షన్‌ నుంచి ములగమూడు జంక్షన్‌ వరకు ఆయన పాదయాత్రలో పాల్గొంటారు. 10వ తేది ఉదయం 6 గంటలకు ములగమూడు సెయింట్‌ మేరీస్‌ ఐసీఎస్ఈ పాఠశాల నుంచి సామియార్‌ మఠం వరకు, 6.30 గంటలకు అక్కడి నుంచి శ్రేయన్‌కులి వరకు, 7 గంటలకు మార్తాండంలోని స్వాతంత్య్ర సమరయోధుడు నేసమణి స్మారక క్రైస్తవ కళాశాల వరకు ప్రయాణం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కుళుత్తురై జంక్షన్‌ వరకు, సాయంత్రం 4 గంటలకు అక్కడి నుంచి పడతాలుమోడు జంక్షన్‌ వరకు ప్రయాణించి, రాత్రి సేరువారకోణం ప్రాంతంలో బసచేస్తారు. 11వ తేది అక్కడి నుంచి కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం కు రాహుల్‌ గాంధీ పాదయాత్రగా బయల్దేరి వెళతారు.  

Updated Date - 2022-09-08T16:05:12+05:30 IST