Former RBI Governor Raghuram Rajan : జోడోయాత్రలో రఘురామ్ రాజన్
ABN , First Publish Date - 2022-12-15T03:06:39+05:30 IST
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని
రాజస్థాన్‌లో రాహుల్‌తో కలిసి నడిచిన ఆర్బీఐ మాజీ గవర్నర్
జైపూర్, డిసెంబరు 14: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో సాగుతున్న యాత్రలో బుధవారం ఉదయం భాడోతీ నుంచి బాద్‌షాపురా వరకు ఆయన రాహుల్‌తో కలిసి నడిచారు. విద్వేష శక్తులకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేసేందుకు చేపట్టిన యాత్రకు ప్రజల మద్దతు పెరుగుతోందని, యాత్ర విజయవంతమవుతోందని రఘురాంరాజన్, రాహుల్ కలిసి నడిస్తున్న ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. కాగా సెప్టెంబరు 7న కన్యాకుమారిలో రాహుల్ చేపట్టిన జోడో యాత్ర ఈ శుక్రవారం నాటికి వందరోజులు పూర్తిచేసుకోనుంది.