కొత్త అటార్నీ జనరల్‌గా ఆర్‌. వెంకటరమణి

ABN , First Publish Date - 2022-09-29T08:59:24+05:30 IST

14వ అటార్నీ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది, లా కమిషన్‌ మాజీ సభ్యుడు ఆర్‌. వెంకటరమణిని నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కొత్త అటార్నీ జనరల్‌గా ఆర్‌. వెంకటరమణి

అక్టోబరు 1 నుంచి బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): 14వ అటార్నీ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది, లా కమిషన్‌ మాజీ సభ్యుడు ఆర్‌. వెంకటరమణిని నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు, గ్రీన్‌ ట్రైబ్యునల్‌. పోలవరం పర్యావరణ కేసులతోపాటు అనేక జలవివాదాల కేసులను వెంకటరమణి సుదీర్ఘకాలంగా వాదిస్తున్నారు. ప్రస్తుత అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ పదవీకాలం ఈ నెల 30న ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1 నుంచి వెంకటరమణి అటార్నీ జనరల్‌గా వ్యవహరిస్తారు. నాలుగు దశాబ్దాలకుపైగా సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేసిన వెంకటరమణి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ప్రత్యేక సీనియర్‌ కౌన్సెల్‌గా కూడా వ్యవహరించారు.

Read more