Queen Elizabeth-2: బ్రిటన్ రాణి కన్నుమూత..!

ABN , First Publish Date - 2022-09-09T04:51:59+05:30 IST

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2(96) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు.

Queen Elizabeth-2: బ్రిటన్ రాణి కన్నుమూత..!

లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2(96) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. స్కాట్‌ల్యాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు తాజాగా ప్రకటించాయి. 70 ఏళ్ల పాటు బ్రిటన్ రాజ్యాధినేత్రిగా కొనసాగిన ఆమె.. సుదీర్ఘకాలంపాటు బ్రిటన్‌ను పరిపాలించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. రాణి మరణంతో యావత్ బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది. 1926 ఏప్రిల్ 21న లండన్‌లో జన్మించిన ఎలిజబెత్-2..  1952లో రాణిగా బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించారు. 1947లో ఆమె ప్రిన్స్ ఫిలిప్‌ను వివాహమాడారు. కాగా.. ప్రిన్స్ ఫిలిప్ గతేడాది కన్నుమూశారు. 



Updated Date - 2022-09-09T04:51:59+05:30 IST