వచ్చే వారమే పెట్రో వడ్డన?
ABN , First Publish Date - 2022-03-05T07:11:49+05:30 IST
త్వరలోనే పెట్రో ల్, డీజిల్ ధరలు భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కె ట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో నష్టాన్ని..
లీటరుపై రూ.12 పెంచే అవకాశం
న్యూఢిల్లీ, మార్చి 4: త్వరలోనే పెట్రో ల్, డీజిల్ ధరలు భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కె ట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో నష్టాన్ని పూడ్చుకోవడానికి చమురు విక్రయ కంపెనీలు భారీగానే ధరలను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర గత తొమ్మిదేళ్లలో మొదటిసారిగా గురువారం 120 డాలర్లు దాటింది. శుక్రవారం కాస్త వెనక్కి తగ్గినా ధర 111 డాలర్ల ఎగువనే కదలాడింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో గత 4 నెలలుగా పెట్రో ల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. ఫలితంగా వాహనదారులకు ఊరట లభిస్తోంది. అయితే ధరల పెరుగుదల నేపథ్యంలో నష్టాలు పూడ్చుకునేందుకు మార్చి 16లోపు లీటరు పెట్రోల్, డీజిల్పై రూ.12కు మించి పెంచవలసి ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఓ నివేదికలో పేర్కొంది. ఆయిల్ కంపెనీల మార్జిన్లను కూడా కలిపితే ధర ను రూ.15.1 పెంచాల్సి ఉంటుందని తెలిపింది. ఇక మార్చి 3 నాటికి భారత్ కొనుగోలు చేస్తున్న బ్యారెల్ ముడిచమురు ధర 117.39 డాలర్లు ఉందని, 2021 నుంచి ఇదే అత్యధికమని తెలుస్తోంది.