మళ్లీ Marriage చేసుకుంటున్న పంజాబ్ సీఎం Bhagwant Mann

ABN , First Publish Date - 2022-07-06T20:32:40+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి డాక్టర్ భగవంత్ మాన్ గురువారంనాడు చండీగఢ్‌లో డాక్టర్ గుర్‌ప్రీత్ ..

మళ్లీ Marriage చేసుకుంటున్న పంజాబ్ సీఎం Bhagwant Mann

న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి డాక్టర్ భగవంత్ మాన్ గురువారంనాడు చండీగఢ్‌లో డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌ను పెళ్లాడనున్నారు. ఇది మాన్ రెండో వివాహం. కుటుంబసభ్యులు, పలువురు మిత్రుల సమక్షంలో ప్రైవేటు కార్యక్రమంగా ఈ వివాహం జరుగనుంది.


పంజాబ్ సీఎం తన మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్‌కు ఆరేళ్ల క్రితం విడాకులు ఇచ్చారు. ఇద్దరు పిల్లలతో ఇంద్రపీత్ సింగ్ అమెరికాలో ఉంటున్నారు. సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఈ ఇద్దరు పిల్లలు ఇటీవల హాజయ్యారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, గుర్‌ప్రీత్‌ కౌర్‌ను భగవంత్ మాన్ తల్లి తన కోడలుగా చేసుకోవాలని అభిలషించారు. మాన్ మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరుకున్న ఆయన తల్లి, సోదరి స్వయంగా వధువును ఎంపిక చేశారు.


అతిథులు వీరే...

అధికారికంగా ధ్రువీకరణ కానప్పటికీ, ఆమ్ ఆద్మీ  పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారంనాడు జరిగే ఈ వివాహ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో కలిసి రానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా రావచ్చు. పంజాబ్ క్యాబినెట్ మంత్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు హాజరవుతారు.

Updated Date - 2022-07-06T20:32:40+05:30 IST