కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం Bhagwant Mann

ABN , First Publish Date - 2022-07-21T15:13:30+05:30 IST

పంజాబ్(Punjab) ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ (Bhagwant Mann) కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.

కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం Bhagwant Mann

ఢిల్లీ : పంజాబ్(Punjab) ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ (Bhagwant Mann) కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ(Delhi)లోని ప్రైవేటు  ‘అపోలో’ హాస్పిటల్‌లో(Apollo Hospital) అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు  ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. ఇందుకు సంబంధించిన చికిత్సను అందించారు. బుధవారం రాత్రి సీఎం మాన్ అస్వస్థతకు గురయ్యారని, తక్షణమే హాస్పిటల్‌లో చేరారని ఆప్ వర్గాలు వెల్లడించాయి.


కాగా బుధవారం మూసేవాలా హంతకులను విజయవంతంగా ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు బలగాలను సీఎం భగ్వంత్ మాన్ అభినందించారు. ఆపరేషన్‌ను అనుకున్నట్టు పూర్తిచేశారని మెచ్చుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్లను జగ్‌రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. వీరి నుంచి 1 ఏకే 47, 1 పిస్టోల్‌ను రికవరీ చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో సంఘ వ్యతిరేక శక్తులపై నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించామని ఈ సందర్భంగా పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-07-21T15:13:30+05:30 IST