స్కూల్ పీటీ నిర్వాకమిది.. అరెస్ట్ చేసిన పోలీసులు... కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-07-11T01:00:07+05:30 IST

విద్యార్థులకు వ్యాయామ పాఠాలు నేర్పించాల్సిన ఓ పీటీ(ఫిజికల్ ట్రైనింగ్) మాస్టారు బాలికలపట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

స్కూల్ పీటీ నిర్వాకమిది.. అరెస్ట్ చేసిన పోలీసులు... కారణం ఇదే..

పుణె : విద్యార్థులకు వ్యాయామ పాఠాలు నేర్పించాల్సిన ఓ పీటీ(ఫిజికల్ ట్రైనింగ్) మాస్టారు బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 14 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపుల(molesting )కు పాల్పడ్డాడు. మహారాష్ట్ర(Maharastra)లోని పుణె(Pune)లో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు పీటీ అసిస్టెంట్‌(PT Assistent)గా పనిచేస్తున్నాడు. పీటీ సెషన్లు నిర్వహించే సమయంలో 8 - 10 తరగతుల బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. జూన్ 29 నుంచి జులై 6 మధ్య 14 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. బాలికలను అనుచితంగా తాకడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడ్డాడు.


భయపడిపోయిన బాలికలు తొలుత స్కూల్ హెడ్‌మాస్టర్‌కి ఫిర్యాదు చేశారు. హెడ్‌మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెప్పారు. వేధింపులకు సంబంధించిన పలు సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసులు పెట్టామని వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, రిమాండ్‌లో ఉన్నాడని వెల్లడించారు. కేసు దర్యాప్తులో స్కూల్ యాజమాన్యం సహకరిస్తోందని వివరించారు.


కాగా నిందిత పీటీ అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్కూల్లో చేరాడు. గతంలో ఇతడు ఎవరినైనా లైంగికంగా వేధించాడా, బాధిత బాలికలు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. సున్నితమైన ఈ విషయంపై విద్యార్థులతో మాట్లాడుతున్నామని చెప్పారు.

Read more