శాంతియుతంగా నిరసనలు తెలపండి..ఆపొద్దు : ప్రియాంక గాంధీ
ABN , First Publish Date - 2022-06-20T00:42:28+05:30 IST
నిరుద్యోగులు తమ నిరసనలు ఆపవద్దని, కానీ శాంతియుతంగా కొనసాగించి, ప్రభుత్వాన్ని కూల్చాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా..

న్యూఢిల్లీ: నిరుద్యోగులు తమ నిరసనలు ఆపవద్దని, కానీ శాంతియుతంగా కొనసాగించి, ప్రభుత్వాన్ని కూల్చాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka gandhi vadra) అన్నారు. అగ్నిపథ్ పథకం సైన్యాన్ని (Army) అంతం చేస్తుందని ఆరోపించారు.
''ఈ స్కీమ్ దేశయువతను చంపేస్తుంది. సైన్యాన్ని అంతం చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం చూడండి. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, అహింసాయుత పద్ధతుల్లో ప్రభుత్వాన్ని పడగొట్టండి. మీ లక్ష్యం దేశానికి నిజమైన ప్రభుత్వాన్ని తీసుకురావాలి. దేశ ఆస్తులను పరిరక్షించండి. నిరసనలు శాంతియుతంగా చేయాలని, ఆపొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మీ హక్కు, ఇది మీ దేశం, మీ దేశాన్ని పరిరక్షించుకునే బాధ్యత మీకు ఉంది. ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్త మీతో ఉంటారు'' అని ఓ వీడియో సందేశంలో ప్రియాంక అన్నారు.