పన్నుపెంపుపై కమలనాథుల పోరు

ABN , First Publish Date - 2022-04-09T16:13:08+05:30 IST

రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ధర్నా జరిగింది. బీచ్‌ రోడ్డులోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యే

పన్నుపెంపుపై కమలనాథుల పోరు

- ప్రభుత్వం పునః పరిశీలించాలి

- ఎమ్మెల్యే నయినార్‌ నాగేందర్‌


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ధర్నా జరిగింది. బీచ్‌ రోడ్డులోని కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యే నయినార్‌ నాగేందర్‌ నేతృత్వంలో ధర్నా చేసారు.. పార్టీ ఎమ్మెల్యేలు వానతి శ్రీనివాసన్‌, ఎంఆర్‌.గాంధీ, సరస్వతితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు విపి దురైస్వామి, చక్రవర్తి, మాజీ డిప్యూటీ మేయర్‌ కరాటే త్యాగరాజన్‌ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నయినార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ... ఆస్తి పన్నును పెంపుపై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలన్నారు. ఏకంగా 150 శాతం పెంపు అనేది సాధారణ విషయం కాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెంచిన ఆస్తిపన్నును తగ్గించాలని తమ పార్టీతో పాటు అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రజల ప్రతి సమస్యపై తమ పార్టీ పోరాటాలు, ఆందోళనలు చేస్తుందన్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణం పెంచిన ఆస్తిపన్నును తగ్గించాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-04-09T16:13:08+05:30 IST