Principal Secretary: వైద్యరంగంలో అగ్రగామిగా రాష్ట్రం
ABN , First Publish Date - 2022-12-15T11:15:48+05:30 IST
దేశంలోనే వైద్యరంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్రప్రభుత్వ పర్యాటక, సంస్కృతి, ఆధ్యాత్మిక, దేవాదాయ శాఖ
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 14: దేశంలోనే వైద్యరంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్రప్రభుత్వ పర్యాటక, సంస్కృతి, ఆధ్యాత్మిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.బి.చంద్ర మోహన్(Principal Secretary Dr. B. Chandra Mohan) అన్నారు. కొళత్తూర్-మాధవరంలోని మెరీడియన్ ఆస్పత్రిలో నూతనంగా అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్‌ను డా.చంద్రమోహన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం వైద్యరంగానికి ప్రాధాన్యత కల్పిస్తోందని, కార్పొరేట్ ఆస్పత్రులు కూడా పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మెరీడియన్ ఆసుపత్రి చైర్మన్, ఎమ్మెల్యే రూబి మనోహరన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి డా.కె.విజయకార్తికేయన్, మాధవరం ఎమ్మెల్యే ఎస్.సుదర్శనం, సదరన్ సెంటర్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ భీష్మ ఆర్.రాధాకృష్ణన్, మాజీ క్రికెటర్ లక్షీపతి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.