ఏప్రిల్ 24న ప్రధాని Narendra modi బెంగళూరు పర్యటన
ABN , First Publish Date - 2022-03-15T17:18:54+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ కర్ణాటక పర్యటనకు విచ్చేయనున్నారు. శివమొగ్గ జిల్లాలోని హొళళూరు గ్రామానికి ఏప్రిల్ 24న విచ్చేసే ప్రధాని ఇక్కడి నుంచే జాతీయ పంచాయతీ దినోత్సవంలో

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ కర్ణాటక పర్యటనకు విచ్చేయనున్నారు. శివమొగ్గ జిల్లాలోని హొళళూరు గ్రామానికి ఏప్రిల్ 24న విచ్చేసే ప్రధాని ఇక్కడి నుంచే జాతీయ పంచాయతీ దినోత్సవంలో పాల్గొంటారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటనలో మరో రెండు కార్యక్రమాలను చేర్చేందుకు ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న ఏడాదిలో కర్ణాటక విజన్ డాక్యుమెంట్ను కూడా ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు.