శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, పీఎం

ABN , First Publish Date - 2022-04-10T17:22:59+05:30 IST

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, పీఎం

న్యూఢిల్లీ : శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో అందరూ సంతోషం, శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రీరాముని ఆదర్శాలను మన జీవితాల్లో నింపుకుని దేశ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ట్వీట్‌లో, దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం, ఆయన కర్తవ్య దీక్ష, సమున్నత ఆదర్శాలు సర్వ మానవాళికి మార్గదర్శకం, ప్రేరణాత్మకం అని పేర్కొన్నారు. శ్రీరాముని ఆదర్శాలను మన జీవితాల్లో నింపుకుని దేశ నిర్మాణానికి కృషి చేయడానికి ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. 


శ్రీరామ నవమి సందర్భంగా మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, దేశ ప్రజలందరికీ శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషం, శాంతి, సౌభాగ్యాలను పొందాలని ఆకాంక్షించారు. జై శ్రీరామ్ అని నినదించారు. 


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన ట్వీట్‌లో, శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనందరం శక్తి, సామర్థ్యాలను పొందడానికి మర్యాద పురుషోత్తముడైన భగవాన్  శ్రీరాముడు ప్రేరణగా నిలుస్తాడని పేర్కొన్నారు. జై శ్రీరామ్ అని నినదించారు. 


మోదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు గుజరాత్‌లోని ఉమియ మాత దేవాలయం వ్యవస్థాపక ఉత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. 


Updated Date - 2022-04-10T17:22:59+05:30 IST