Pongal: పొంగల్‌కు రవాణా శాఖ సన్నద్ధం

ABN , First Publish Date - 2022-12-15T11:05:58+05:30 IST

పొంగల్‌ పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభమైంది. వచ్చే ఏడాది

Pongal: పొంగల్‌కు రవాణా శాఖ సన్నద్ధం

- బస్సుల్లో రిజర్వేషన్‌ ప్రారంభం

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 14: పొంగల్‌ పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ పొంగల్‌, 16న పశువుల పండుగ, 17న కనుమ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, పండుగలకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో నాలుగు నెలల క్రితమే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌ ఫుల్‌ కాగా, ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ రైల్వే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, రైళ్లలో రిజర్వేషన్‌ ఫుల్‌ అయి, వెయిటింగ్‌ లిస్ట్‌ భారీ గా ఉండడంతో ప్రజలు ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పొంగల్‌ పండుగ ముందస్తు రిజర్వేషన్‌ను ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు రవాణా సంస్థ (ఎస్‌ఈటీసీ) ప్రారంభించింది. ఇప్పటికే 300 కి.మీ పైగా ప్రయాణం చేసే వారు 30 రోజుల ముందుగా రిజర్వేషన్‌ చేసుకొనే వసతి కల్పిం చారు. ఆ ప్రకారం, జనవరి 12వ తేది ప్రయాణం చేయాలనుకొనే వారు మంగళవారం నుంచి ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకుంటున్నారు. 13వ తేది ప్రయాణం చేయగోరువారు బుధవారం రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు tnstc.-com అనే వెబ్‌సైట్‌లో రిజర్వేషన్‌ చేయించుకోవచ్చని, పండుగ రెండ్రోజుల ముందుగా అత్యవసరం గా వెళ్లే శ్రమను ప్రజలు తగ్గించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రద్దీని బట్టి అదనపు బస్సులు నడుపుతామని ఎస్‌ఈటీసీ ప్రకటించింది.

Updated Date - 2022-12-15T11:06:01+05:30 IST