Pongal: పొంగల్‌ కానుకలో ఆరడుగుల చెరకు

ABN , First Publish Date - 2022-12-31T10:23:26+05:30 IST

పొంగల్‌(Pongal) ఉచితాల్లో ఆరడుగుల చెరకు గడ అందించాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పొంగల్‌ సందర్భంగా బి య్యం

Pongal: పొంగల్‌ కానుకలో ఆరడుగుల చెరకు

- ప్రభుత్వం ఉత్తర్వులు

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 30: పొంగల్‌(Pongal) ఉచితాల్లో ఆరడుగుల చెరకు గడ అందించాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పొంగల్‌ సందర్భంగా బి య్యం కార్డుదారులకు రూ. 1,000 నగదు, కిలో చక్కెర, పచ్చిబియ్యం, చెరకు గడ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. ఆ ప్రకారం, పచ్చిబియ్యం, చక్కెరలను రేషన్‌ దుకాణాలకు పంపిస్తున్నారు. తాజాగా, చెరకు గడ పంపిణీపై ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో, పొంగల్‌ ఉచితాల్లో 6 అడుగుల చెరకు గడ ఇవ్వాలని పేర్కొంది. అదే సమయంలో ఏ రోజు పంపిణీ చేసే చెరకు ఆ రోజునే కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ఒకేసారి మొత్తం కొనుగోలు చేస్తే చెరకు వాడిపోయే అవకాశముందని, అందువల్ల ఎప్పటికప్పుడు చెరకు గడలు కొనుగోలు చేయాలని సూచించింది.

13న పనిచేయనున్న రేషన్‌ దుకాణాలు...

ప్రభుత్వం ప్రకటించిన పొంగల్‌ ఉచిత ప్యాక్‌ జనవరి 9 నుంచి పంపిణి చేయనున్నారు. రేషన్‌ దుకాణాల(Ration shops) వద్ద రద్దీ అరికట్టేందుకు రోజుకు 200 నుంచి 250 రేషన్‌కార్డుదారులకు మాత్రమే ఉచిత ప్యాక్‌ అందించనుండగా, అందుకు సంబంధించిన రోజు, సమయం తదితర వివరాలతో కూడిన టోకెన్లు జనవరి 4 నుంచి రేషన్‌ సిబ్బంది ఇళ్లకే వెళ్లి అందజేయనున్నారు. ఉచిత ప్యాక్‌ పంపిణీలో ఏవైన సమస్యలుంటే ప్రజలు ‘1967’, ‘1800 425 5901’ అనే నెంబర్లకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2022-12-31T10:23:28+05:30 IST