Pmతో Mpల భేటీ

ABN , First Publish Date - 2022-07-20T14:00:38+05:30 IST

చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవానికి రావాలంటూ డీఎంకే ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28 నుంచి మహాబలిపురంలో చెస్‌

Pmతో Mpల భేటీ

- చెస్‌ ఒలంపియాడ్‌కు ఆహ్వానం

- అంగీకరించిన ప్రధాని

- 27న చెన్నైకి మోదీ రాక


చెన్నై, జూలై 19 (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవానికి రావాలంటూ డీఎంకే ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28 నుంచి మహాబలిపురంలో చెస్‌ ఒలంపియాడ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ పోటీలను నెహ్రూ స్టేడియంలో ప్రధాని మోదీ ప్రారంబించనున్నారు.. ఆ ప్రారంభోత్సవానికి మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు. అయితే కరోనా పాజిటివ్‌ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొంది వైద్యుల సలహా మేరకు ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటుండటంతో ఆయన వెళ్ళలేకపోయారు. ఈ నేపథ్యంలో స్టాలిన్‌ తరఫున మోదీని ఆహ్వానించేందుకు డీఎంకే ఎంపీలు కనిమొళి, టీఆర్‌ బాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు ఢిల్లీ వెళ్ళి మంగళవారం ఉదయం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో మోదీని కలుసుకున్నారు. చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానపత్రాన్ని స్వీకరించిన మోదీ తప్పకుండా చెన్నై వచ్చి పోటీలను ప్రారంభిస్తానని తెలిపారు. ఈ పోటీలను ప్రారంభించేందుకుగాను మోదీ ఈ నెల 27 సాయంత్రం నగరానికి విచ్చేయనున్నారు. 

అదే విధంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాధ్‌సింగ్‌ నుకూడా డీఎంకే ఎంపీలు కనిమొళి, టీఆర్‌ బాలు కలిసి చెస్‌ ఒలంపియాడ్‌కు ఆహ్వానించారు.

Updated Date - 2022-07-20T14:00:38+05:30 IST