శివాజీ, శంభాజీ నేటికీ స్ఫూర్తిప్రదాతలే : Narendra Modi
ABN , First Publish Date - 2022-06-15T00:17:43+05:30 IST
ఛత్రపతి శివాజీ మహారాజు, శంభాజీ మహారాజు మన దేశానికి

ముంబై : ఛత్రపతి శివాజీ మహారాజు, శంభాజీ మహారాజు మన దేశానికి మహోన్నత సేవలు చేశారని, దేశభక్తి విషయంలో నేటికీ వారు ప్రతి భారతీయునికి స్ఫూర్తిప్రదాతలేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ముంబైలోని రాజ్ భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఆయన జల్ భూషణ్ భవనం, విప్లవకారుల గ్యాలరీలను ప్రారంభించారు.
స్వరాజ్యం గురించి మాట్లాడేటపుడు ఛత్రపతి శివాజీ మహారాజు (Chhatrapati Shivaji Maharaj), ఛత్రపతి శంభాజీ మహారాజు (Chhatrapati Sambhaji Maharaj)ల జీవితాలు నేటికీ ప్రతి భారతీయునిలో దేశభక్తి భావాలను బలోపేతం చేస్తాయని Narendra Modi తెలిపారు.
అంతకుముందు ప్రధాని మోదీకి ఐఎన్ఎస్ శిఖర్ హెలిపోర్ట్లో స్వాగతం పలికినవారిలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రోటోకాల్ మంత్రి ఆదిత్య థాకరే ఉన్నారు.
మసీదుల్లో మితిమీరిన శబ్దంతో లౌడ్స్పీకర్లు, హనుమాన్ చాలీసా వివాదాల నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే, నరేంద్ర మోదీ ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి. మరోవైపు బీజేపీ, శివసేన మధ్య ప్రస్తుతం హోరాహోరీగా ఉన్న సంగతి తెలిసిందే.
మొదటి లత మంగేష్కర్ పురస్కారాన్ని స్వీకరించడానికి ప్రధాని మోదీ ఏప్రిల్ 25న ముంబై వచ్చినపుడు, ఆ కార్యక్రమంలో ఉద్ధవ్ థాకరే పాల్గొనలేదు. నేటి కార్యక్రమంలో మోదీతోపాటు వేదికను పంచుకోవడం విశేషం.