PM Modi: షింజో అబే అంత్యక్రియల్లో ఆస్ట్రేలియా ప్రధానితో భారత ప్రధాని మోదీ మాటామంతీ

ABN , First Publish Date - 2022-09-27T18:01:00+05:30 IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్‌కు వెళ్లారు. జపాన్ మాజీ ప్రధాని, దివంగత షింజో అబే అంత్యక్రియలు మంగళవారం నాడు టోక్యోలో..

PM Modi: షింజో అబే అంత్యక్రియల్లో ఆస్ట్రేలియా ప్రధానితో భారత ప్రధాని మోదీ మాటామంతీ

టోక్యో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జపాన్‌కు వెళ్లారు. జపాన్ మాజీ ప్రధాని, దివంగత షింజో అబే (Shinzo Abe funeral) అంత్యక్రియలు మంగళవారం నాడు టోక్యోలో (Tokyo) నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రధానమంత్రి మోదీ సహా 20 మందికి పైగా దేశాధినేతలు టోక్యో వెళ్లారు. వీరితో పాటు 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. భారత్‌-జపాన్‌ మైత్రిని మరింత బలోపేతం చేయడంలో షింజో కీలకపాత్ర పోషించారు. ‘‘జపాన్‌ మాజీ ప్రధాని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టోక్యో వెళ్తున్నా. ఆయన మనకు ఆత్మీయ మిత్రుడు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు ట్వీట్ చేశారు. భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ మాట్లాడుకుంటూ కనిపించారు.



జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే(67) జులై 8, 2022న దారుణ హత్యకు గురయ్యారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరించిన షింజో ఓ మాజీ సైనికుడి తూటాలకు బలయ్యారు. దక్షిణ జపాన్‌లోని నారా నగరంలో రైల్వే స్టేషన్‌ వెలుపల ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది. వెనుక నుంచి వచ్చిన మాజీ సైనికుడు నాటు తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పిడికిలి పైకెత్తి మాట్లాడుతున్న షింజో అబే మెడలో ఒక తూటా, గుండెలో మరో తూటా వెంట వెంటనే దూసుకుపోయాయి. వెంటనే ఆయన ఛాతి పట్టుకొని కుప్పకూలిపోయారు. తెల్లటి చొక్కా ఎర్రటి రక్తంతో తడిసిపోవడంతో ఆయనపై కాల్పులు జరిగిన విష యం చుట్టుపక్కల వారికి అర్థమైంది. అప్పటికప్పుడు హెలికాప్టర్‌పై ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే షింజో తుది శ్వాస విడించారు. జపాన్‌ చరిత్రలో అత్యధిక కాలం (9 ఏళ్లు) ప్రధానిగా కొనసాగిన ఘనత కూడా ఆయనదే.

Updated Date - 2022-09-27T18:01:00+05:30 IST