24 గంటల్లో మూడోసారి.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై మోదీ అత్యున్నతస్థాయి సమావేశం

ABN , First Publish Date - 2022-03-01T03:03:11+05:30 IST

ఉక్రెయిన్ పరిస్థితిపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు

24 గంటల్లో మూడోసారి.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై మోదీ అత్యున్నతస్థాయి సమావేశం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పరిస్థితిపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడం గత 24 గంటల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. పర్యటనల్లో ఉన్న పలువురు మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్టు తెలుస్తోంది.


విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌, ఇతర ఉన్నతాధికారులతో మోదీ నిన్న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించారు. కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ తదితరులు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లి భారతీయుల తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ వేలాదిమంది భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని తరలించేందుకు ఏర్పాట్లు ప్రారంభించిన భారత్ ఇప్పటి వరకు 5 విమానాల్లో 1200 మందిని స్వదేశానికి తరలించింది. 

Updated Date - 2022-03-01T03:03:11+05:30 IST