Covid positive: ఫీజర్ కంపెనీ సీఈవో అల్బర్ట్ బౌర్లాకు కరోనా
ABN , First Publish Date - 2022-08-17T13:37:55+05:30 IST
ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫీజర్ సీఈవో(Pfizer CEO Albert Bourla) అల్బర్ట్ బౌర్లాకు కొవిడ్ పాజిటివ్...

వాషింగ్టన్ : ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫీజర్ సీఈవో(Pfizer CEO Albert Bourla) అల్బర్ట్ బౌర్లాకు కొవిడ్ పాజిటివ్ అని పరీక్షల్లో(tests Covid positive) తేలింది. తనకు స్వల్ప కరోనా లక్షణాలున్నాయని అల్బర్ట్ బౌర్లా చెప్పారు.తాను ఐసోలేషన్ లో(isolating) ఉండి అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పారు. ‘‘నేను ఫీజర్ కంపెనీకి చెందిన బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ తీసుకున్నందు వల్ల కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి,(very mild symptoms) కరోనా తగ్గడానికి నేను పాక్స్ లోవిడ్ మందులు వాడటం ప్రారంభించాను.’’ అని అల్బర్ట్ బౌర్లా ట్వీట్ చేశారు.
పాక్స్ లోవిడ్(Paxlovid)మందులను అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ నివారణకు వాడేందుకు ఎఫ్డీఏ గత ఏడాది డిసెంబరు నెలలో అనుమతించిందని అల్బర్ట్ చెప్పారు. గత నెలలో యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ కరోనా బారిన పడినపుడు కూడా పాక్స్ లోవిడ్ వాడారు. మరో వైపు యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ భార్య, యూఎస్ ఫస్ట్ లేడీ జిల్ బిడెన్( US first lady Jill Biden) కూడా కరోనా బారిన పడ్డారు.జిల్ బిడెన్ కూడా పాక్స్ లోవిడ్ మాత్రలు వేసుకోవాలని వైద్యులు సూచించారు.