దసరా ఉత్సవాల్లో హింసకు PFI భారీ కుట్ర

ABN , First Publish Date - 2022-09-27T16:08:23+05:30 IST

దసరా ఉత్సవాల్లో (Dasara Celebrations) హింసకు పీఎఫ్ఐ (PFI) భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల దర్యాప్తులో వెల్లడైంది.

దసరా ఉత్సవాల్లో హింసకు PFI భారీ కుట్ర

Delhi : దసరా ఉత్సవాల్లో (Dasara Celebrations) హింసకు పీఎఫ్ఐ (PFI) భారీ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ (RSS) నేతలే టార్గెట్‌గా వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఏటీఎస్ పోలీస్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. నవరాత్రి ఉత్సవాల్లో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పీఎఫ్ఐ హిట్‌ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఉన్నట్టు సమాచారం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. సంబంధిత కార్యాలయాల దగ్గర భద్రతను పెంచారు.


కొద్ది రోజుల క్రితం అంటే బీహార్‌లోని పాట్నా(patna) నగర పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని(PM Narendra Modi) హతమార్చేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర(PFI conspiracy) పన్నిందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది జులై నెలలో ప్రధాని మోదీ పాట్నా పర్యటన సందర్భంగా పీఎఫ్ఐ సభ్యులు దాడికి విఫలయత్నం చేశారని దర్యాప్తులో తేలింది. ప్రధానిపై దాడి చేసేందుకు పీఎఫ్ఐ పలువురు కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారని వెల్లడైంది. ప్రధానితోపాటు యూపీలోని పలువురు ప్రముఖులపై దాడికి పీఎఫ్ఐ మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది.ఎన్ఐఏ, ఈడీలు దేశవ్యాప్తంగా 15రాష్ట్రాల్లో సోదాలు జరిపి 100 మందిని అరెస్ట్ చేసింది.

Read more