India and Bangladeshల మధ్య ప్యాసింజర్ రైళ్లు పునర్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-19T15:22:06+05:30 IST

భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ప్యాసింజర్ రైలు సేవలు మే 29 వతేదీ నుంచి పునర్ ప్రారంభించనున్నారు...

India and Bangladeshల మధ్య ప్యాసింజర్ రైళ్లు పునర్ ప్రారంభం

న్యూఢిల్లీ:  భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ప్యాసింజర్ రైలు సేవలు మే 29 వతేదీ నుంచి పునర్ ప్రారంభించనున్నారు.కొవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ఈ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని నగరాల మధ్య రైలు సేవలు మార్చి 2020లో నిలిపివేశారు.ఢాకా నుంచి కోల్‌కతా-ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్‌ను బంగ్లాదేశ్ రైల్వే రేక్ ద్వారా, కోల్‌కతా-ఖుల్నా బంధన్ ఎక్స్‌ప్రెస్‌ను కోల్‌కతా నుంచి ఇండియన్ రైల్వేస్ రేక్ ద్వారా మే 29వతేదీన తిరిగి ప్రారంభించాలని భారత రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.రైల్ భవన్ నుంచి భారతదేశం ,బంగ్లాదేశ్ రైల్వే మంత్రులు మిటాలి ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. జూన్ 1న ఎన్జీపీ-ఢాకా మిటాలి ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభించనున్నారు.ఆ సమయంలో బంగ్లాదేశ్ రైల్వే మంత్రి భారతదేశానికి వస్తారని భావిస్తున్నారు.


Read more