భారత్‌ జోడో యాత్రలో పాల్గొనండి

ABN , First Publish Date - 2022-12-31T04:57:28+05:30 IST

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో జనవరి మూడో తేదీ నుంచి నిర్వహించనున్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కాంగ్రెస్‌ నేత ఒకరు ఆహ్వానించారు.

భారత్‌ జోడో యాత్రలో పాల్గొనండి

మంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్‌ నేత ఆహ్వానం

న్యూఢిల్లీ, డిసెంబరు 30: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో జనవరి మూడో తేదీ నుంచి నిర్వహించనున్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కాంగ్రెస్‌ నేత ఒకరు ఆహ్వానించారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో రాహుల్‌ గాంధీ గెలుపొందడం గమనార్హం. అందువల్ల యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆమెకే మొదటి ఆహ్వానాన్ని పంపించామని కాంగ్రెస్‌ నాయకుడు దీపక్‌ సింగ్‌ చెప్పారు.

Updated Date - 2022-12-31T04:57:28+05:30 IST

Read more