NITI Aayog సీఈఓగా బాధ్యతలు చేపట్టిన Parameswaran Iyer

ABN , First Publish Date - 2022-07-12T02:16:59+05:30 IST

స్వచ్ఛభారత్ మిషన్ మలుకు సారథ్యం వహించిన పరమేశ్వరన్ అయ్యర్ నీతి అయోగ్ సీఈఓ‌గా...

NITI Aayog సీఈఓగా బాధ్యతలు చేపట్టిన Parameswaran Iyer

న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్ (Swachh Bharat Mission) అమలుకు సారథ్యం వహించిన పరమేశ్వరన్ అయ్యర్ (Parameswaran Iyer) నీతి అయోగ్ (NITI Aayog) సీఈఓ‌గా సోమవారంనాడు బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అయ్యర్ ఇటు ప్రభుత్వ అటు ప్రైవేటు రంగంలో సేవలందించారు. 2016 నుంచి 2020 వరకూ తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఆయన పనిచేశారు.


కాగా, నీతి అయోగ్ సీఈవోగా దేశానికి సేవలందించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని ఒక ప్రకటనలో అయ్యర్ తెలిపారు. ట్రాన్స్‌పార్మ్‌డ్ ఇండియా దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర  మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు మరో అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-07-12T02:16:59+05:30 IST