Eps నియామకాలను ఆపండి
ABN , First Publish Date - 2022-07-15T14:09:53+05:30 IST
అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) నాయకత్వంలో నిర్వహించిన సర్వసభ్యమండలి సమావేశం చెల్లదని, ఆ సమావేశంలో

- ఈసీకి ఓపీఎస్ మరో లేఖ
చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) నాయకత్వంలో నిర్వహించిన సర్వసభ్యమండలి సమావేశం చెల్లదని, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ నిబంధనలకు వ్యతిరేకమంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించిన మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) తాజాగా మరో లేఖ రాశారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనట్లు ప్రకటించుకుంటున్న ఈపీఎస్ ప్రస్తుతం పార్టీలో చేస్తున్న కొత్త నియామకాలను అడ్డుకోవాలని ఆలేఖలో కోరారు.ఈపీఎస్ చేస్తున్న నియామకాలు, తొలగింపులు చెల్లవని, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.