Delhiలో తీవ్రమైన వేడిగాలులు...Orange Alert
ABN , First Publish Date - 2022-06-07T17:15:32+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గత రెండు రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి....

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గత రెండు రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి.ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా పొరుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలుల కారణంగా ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. జూన్ 10 తర్వాత వర్షాలు కురుస్తాయని ఐఎండీ IMD అంచనా వేసింది.ఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ మార్కు కంటే ఎక్కువగా ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఢిల్లీతోపాటు హర్యానా, యూపీ, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మరో నాలుగురోజుల పాటు వేడిగాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. ఎండలు మండుతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్ కె జెనామణి చెప్పారు.దేశంలోని ఉత్తర ప్రాంతంలోకి రుతుపవనాలు ఇంకా ప్రవేశించలేదని ఐఎండీ శాస్త్రవేత్త తెలిపారు.