OPS: పొంగల్‌కు రూ.3 వేలు
ABN , First Publish Date - 2022-12-16T09:46:31+05:30 IST
పొంగల్ సందర్భంగా రేషన్ కార్డుదారులకు రూ.3 వేల నగదు అందించాలని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Pa
- ఓపీఎస్ డిమాండ్
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 15: పొంగల్ సందర్భంగా రేషన్ కార్డుదారులకు రూ.3 వేల నగదు అందించాలని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం(Former Chief Minister O. Panneerselvam) రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, ఆర్ధికంగా వెనుకబడిన వారు పండుగ జరుపుకొనేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ రేషన్ కార్డుదారులకు చీర, ధోవతి అందించారని, అనంతరం ఈ పథకాన్ని విస్తరించి సరుకులతో కూడిన గిఫ్ట్ ప్యాక్ పంపిణీ చేశారన్నారు. అనంతరం చీర, ధోవతి, గిఫ్ట్ ప్యాక్‌తో పాటు నగదు అందించే పథకాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అమలుచేశారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ఈ ఏడాది పొంగల్ సందర్భంగా నగదు ఇవ్వకపోగా, ప్రకటించిన 21 సరుకుల గిఫ్ట్ ప్యాక్‌లో 15 సరుకులే ఉన్నాయన్నారు. ఈ సరుకులు కూడా నాణ్యతగా లేవనే ఆరోపణలతో పంపిణీ సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందన్నారు. దీంతో, ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించిన రూ.1,200 కోట్లు వృధా అయ్యాయని తెలిపారు. 2023 పొంగల్ సందర్భంగా నాణ్యతతో కూడిన సరుకులతో పాటు రూ.3 వేల నగదు అందించేలా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని అన్నాడీఎంకే తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఓపీఎస్ పేర్కొన్నారు.