కేరళలో ‘ఆపరేషన్ ఫోకస్’

ABN , First Publish Date - 2022-04-05T23:39:41+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు కలర్‌ఫుల్ లైట్స్ వాడుతున్న వాహనదారులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది కేరళ ప్రభుత్వం. ‘ద మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్’ ఆధ్వర్యంలో పదిరోజుల పాటు కేరళవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఫోకస్’ పేరిట ప్రత్యేక డ్రైవ్ జరుగుతుంది.

కేరళలో ‘ఆపరేషన్ ఫోకస్’

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు కలర్‌ఫుల్ లైట్స్ వాడుతున్న వాహనదారులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది కేరళ ప్రభుత్వం. ‘ద మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్’ ఆధ్వర్యంలో పదిరోజుల పాటు కేరళవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఫోకస్’ పేరిట ప్రత్యేక డ్రైవ్ జరుగుతోంది. సోమవారం ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కలర్‌ఫుల్ హెడ్‌లైట్స్ వాడటంతోపాటు, హై బీమ్ తగ్గించని వాళ్లపై కూడా చర్యలు తీసుకుంటారు. అలాగే వాహనాలకు పార్కింగ్ లైట్స్, ఇండికేటర్ లైట్స్ లేకపోయినా, నాయిస్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ వస్తున్నా, సెర్చ్‌లైట్స్,  అదనపు లైట్లు ఫిట్ చేయించుకున్నా, లైట్ల వెలుతురులో్ నెంబర్ ప్లేట్లు కనిపించకపోయినా వాహనదారులకు జరిమానా విధిస్తారు. సాయంత్రం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి మూడు గంటల వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇటీవల కేరళలోని కన్నూర్‌కు చెందిన ఒక టూరిస్టు బస్సు గోవాలో అగ్ని ప్రమాదానికి గురైంది. దీనికి కారణం.. ఆ బస్సుకు సంబంధించిన ఒరిజినల్ వైర్లను మార్చి, అదనపు లైట్లు ఏర్పాటు చేయడమే అని విచారణలో తేలింది. దీంతో ఇలా అక్రమంగా లైట్లు వాడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ‘ఆపరేషన్ ఫోకస్’ పేరిట ఈ డ్రైవ్ ప్రారంభించారు.

Updated Date - 2022-04-05T23:39:41+05:30 IST