కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-21T07:27:45+05:30 IST

జమ్మూ-కశ్మీర్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ను మంగళవారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు.

కశ్మీర్‌లో తొలి మల్టీప్లెక్స్‌ ప్రారంభం

శ్రీనగర్‌, సెప్టెంబరు 20: జమ్మూ-కశ్మీర్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ను మంగళవారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. శ్రీనగర్‌లోని సోనావార్‌ ప్రాంతంలో ఇనాక్స్‌ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ప్రారంభ సినిమాగా ఆమిర్‌ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్‌ చడ్ఢాను ప్రదర్శించారు. ఈ నెల 30 నుంచి రెగ్యులర్‌ షోలు మొదలవుతాయి. 520 సీట్ల సామర్థ్యం గల మూడు సినిమా హాళ్లు ఇందులో ఉన్నాయి. ఉగ్రవాదం కారణంగా దాదాపు 30 ఏళ్ల క్రితం మూతపడిన సినిమా హాళ్లన్నీ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇటీవలే సోఫియాన్‌, పుల్వామాల్లో రెండు థియేటర్లను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రారంభించారు.

Read more