మంగళూరు సమీపంలో చమురు నౌక మునక

ABN , First Publish Date - 2022-06-27T09:12:27+05:30 IST

కర్ణాటకలోని మంగళూరుకు కొన్ని మైళ్ల దూరంలో సిరియా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక శనివారం మునిగి పోయింది.

మంగళూరు సమీపంలో చమురు నౌక మునక

బెంగళూరు, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని మంగళూరుకు కొన్ని మైళ్ల దూరంలో సిరియా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక శనివారం మునిగి పోయింది. చైనాలోని టియాంగ్జిన్‌నుంచి లెబనాన్‌కు వెళ్తున్న ఎంబీ ప్రిన్సెస్‌ మిరాల్‌ నౌకకు మంగళూరు సమీపం లోని ఉచ్చిల బట్టేపాడి తీరంలో సాంకే తిక కారణాలతో రంధ్రం పడి మునిగిం ది. నౌక నుంచి భారీగా చమురు లీకవడం ఆందోళనకు గురి చేస్తోంది. నౌకలోని 220 మెట్రిక్‌ టన్నుల చమురు సముద్రం లో కలసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నౌక తీరంవైపు ఎందుకు రావలసి వచ్చిందనే కోణంలో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్స్‌తో కలిసి కేంద్రానికి చెందిన ఇతర సంస్థలు దర్యాప్తు చేపట్టాయి. నౌకలోని 15 మంది సిబ్బందిని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్స్‌ మంగళూరు పోలీసులకు ఇటీవల అప్పగించారు. ఈ నేపథ్యంలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఆయిల్‌ లీకేజీ కారణంగా సముద్రంలో చేపలకు ప్రమాదం ఏర్పడింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు చేపట్టింది.

Updated Date - 2022-06-27T09:12:27+05:30 IST