అటల్ టన్నెల్‌లో చిక్కుకున్న పర్యాటకులను రక్షించిన అధికారులు
ABN , First Publish Date - 2022-12-31T04:54:33+05:30 IST
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా కురిసిన మంచు కారణంగా అటల్ టన్నెల్‌లో చిక్కుకున్న పర్యాటకులను అఽధికారులు రక్షించారు.
షిమ్లా, డిసెంబరు 30: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా కురిసిన మంచు కారణంగా అటల్ టన్నెల్‌లో చిక్కుకున్న పర్యాటకులను అఽధికారులు రక్షించారు. రోహ్‌తగ్‌లోని టన్నెల్ మార్గంలో మంచు వల్ల రాకపోకలకు అంతరాయం కలిగి దాదాపు 400 టూరిస్టు వాహనాలు నిలిచిపోయాయి. కీలాంగ్, మనాలీ పోలీసు బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. సుమారు 10 నుంచి 12 గంటల వరకు శ్రమించిన అధికారులు శుక్రవారం ఉదయం 4 గంటల సమయానికల్లా ఆ మార్గాన్ని క్లియర్ చేశారు. పర్యాటకులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు పంపించారు.