Monkeypox: ఒడిశాలోనూ మంకీపాక్స్ అలర్ట్

ABN , First Publish Date - 2022-07-28T16:46:56+05:30 IST

దేశంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలో అలర్ట్ ప్రకటించారు....

Monkeypox: ఒడిశాలోనూ మంకీపాక్స్ అలర్ట్

భువనేశ్వర్ (ఒడిశా): దేశంలో మంకీపాక్స్ వైరస్(Monkeypox) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒడిశా(Odisha) రాష్ట్రంలో అలర్ట్(alert) ప్రకటించారు. ఒడిశా రాష్ట్రంలో కలరా, డయేరియాలతోపాటు మంకీపాక్స్ అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ఒడిశా ప్రభుత్వం వైద్యఆరోగ్యశాఖ అధికారులను(health officials) అప్రమత్తం చేసింది. కేరళ, ఢిల్లీ ప్రాంతాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో వైద్యాధికారులను అప్రమత్తం చేశామని ఒడిశా రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా చెప్పారు. ప్రజల్లో మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి పరీక్షలు చేసేందుకు 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 


వైద్య కళాశాలలు, జిల్లా వైద్యాధికారులు, స్పెషలిస్టులను అప్రమత్తం చేస్తూ ఒడిశా వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి ఒడిశా రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా ఉంచాలని, వారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయాలని మిశ్రా సూచించారు. మంకీపాక్స్ లక్షణాలైన చర్మంపై దుద్దుర్లు రావడం, తీవ్ర జ్వరం ఉంటే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని వైద్యాధికారులు సలహా ఇచ్చారు. 


Updated Date - 2022-07-28T16:46:56+05:30 IST