పాకిస్థాన్‌లోకి భారత్ క్షిపణి ప్రయోగం ప్రమాద ఘటనే...

ABN , First Publish Date - 2022-03-15T15:52:03+05:30 IST

ఇటీవల భారత్‌ నుంచి వచ్చిన క్షిపణి పాకిస్థాన్ దేశంలో పడిపోవడం ప్రమాదవశాత్తు తప్ప మరేమీ లేదని అమెరికా పేర్కొంది....

పాకిస్థాన్‌లోకి భారత్ క్షిపణి ప్రయోగం ప్రమాద ఘటనే...

అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం 

వాషింగ్టన్ : ఇటీవల భారత్‌ నుంచి వచ్చిన క్షిపణి పాకిస్థాన్ దేశంలో పడిపోవడం ప్రమాదవశాత్తు తప్ప మరేమీ లేదని అమెరికా పేర్కొంది. గత వారం పాకిస్థాన్‌పై భారత్ క్షిపణిని ప్రయోగించడం ప్రమాదం తప్ప మరొకటి కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు.ఈ సంఘటన ప్రమాదమని తమ భారతీయ భాగస్వాముల నుంచి విన్నామని నెడ్ ప్రైస్ చెప్పారు. ఇటీవల ప్రమాదవశాత్తూ పాకిస్థాన్‌లో ల్యాండ్ అయిన క్షిపణి తమ సాధారణ నిర్వహణలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే భారత్ శుక్రవారం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 


Updated Date - 2022-03-15T15:52:03+05:30 IST