Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రధాన అధికారి సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-08-18T14:46:01+05:30 IST

జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ హిర్ దేష్‌కుమార్(Jammu and Kashmir's Chief Electoral Officer Hirdesh Kumar) స్థానికేతరులకు(Non locals) ఓటుహక్కుపై సంచలన ప్రకటన...

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రధాన అధికారి సంచలన ప్రకటన

స్థానికేతరులకు ఓటుహక్కు...ఓటర్లను బీజేపీ దిగుమతి చేసుకుంటుందంటూ మాజీ సీఎం వ్యాఖ్య

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ హిర్ దేష్‌కుమార్(Jammu and Kashmir's Chief Electoral Officer Hirdesh Kumar) స్థానికేతరులకు(Non locals) ఓటుహక్కుపై సంచలన ప్రకటన(major decision) చేశారు. స్థానికేతరులు,ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు(Non locals staying in JK) ఓటు హక్కు కల్పిస్తూ(voting rights) జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి హిర్‌దేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీరులో నివాసం ఉంటున్న వారు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జమ్మూకశ్మీరులోని ఆర్మీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల సైనికులు కూడా వారి పేర్లను ఓటర్ల జాబితాలో(voting list) నమోదు చేసుకోవడానికి అనుమతించారు. 


స్థానికేతరులకు జమ్మూకశ్మీరులో ఓటు హక్కు కల్పించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తుందని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. స్థానికేతరులను ఓటు వేయడానికి అనుమతించడం ద్వారా బీజేపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలనుకుంటోందని మెహబూబా ట్వీట్‌లో పేర్కొన్నారు. స్థానికులను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమని మెహబూబా చెప్పారు. జమ్మూకశ్మీరులో బీజేపీ విజయం సాధించడానికి తాత్కాలిక ఓటర్లను దిగుమతి చేసుకుంటుందని మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ లో పేర్కొన్నారు. బీజేపీకి ఓటర్ల దిగుమతి ఎన్నికలలో సహాయపడవని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. Updated Date - 2022-08-18T14:46:01+05:30 IST