Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతికి భద్రతా లోపం, 15 మంది పోలీసు సిబ్బంది గైర్హాజర్

ABN , First Publish Date - 2022-11-06T15:07:08+05:30 IST

నొయిడా: గ్రేటర్ నొయిడాలో జరుగుతున్న ఇండియా ఎక్స్‌పో మార్ట్ ముగింపు రోజైన శనివారంనాడు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌కు కల్పించాల్సిన భద్రత విషయంలో లోపం...

Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతికి భద్రతా లోపం, 15 మంది పోలీసు సిబ్బంది గైర్హాజర్

నొయిడా: గ్రేటర్ నొయిడాలో జరుగుతున్న ఇండియా ఎక్స్‌పో మార్ట్ ముగింపు రోజైన శనివారంనాడు ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌ (Jagdeep Dhankar)కు కల్పించాల్సిన భద్రత విషయంలో లోపం తలెత్తింది. ముగింపు వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో ఆయనకు సెక్యూరిటీ కల్పించాల్సిన 15 మంది పోలీసు సిబ్బంది ఆబ్సెంట్ (Absent) అయ్యారు. సెక్యూరిటీ విధుల్లో ఉండాల్సిన సిబ్బంది విషయంలో డీసీపీ అభిషేక్ వర్మ వెంటనే ఆరా తీయగా, ఐటీ సెల్‌కు చెందిన ఒక ఇన్‌స్పెసక్టర్, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, ఒక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు మహిళా కానిస్టేబుళ్లు గైర్హాజరయ్యారని తెలిసింది. నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా వారు విధుల్లోకి రావడం గుర్తించారు. వెంటనే వీరికి కఠిన ఆదేశాలివ్వడంతో పాటు అబ్సెంటీస్ జాబితాను రిజిస్టర్ చేశారు.

ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా ఉన్నతాధికారులు గ్రేటర్‍ నొయిడాలో భారీ భధ్రతా ఏర్పాట్లు చేశారు. ఇండియా ఎక్స్‌పో మార్ట్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వాటర్ వీక్ ప్రోగ్రాంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించగా, ముగింపు కార్యక్రమంలో జగ్‌దీప్ ధన్‌కర్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు

Updated Date - 2022-11-06T15:10:14+05:30 IST