Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఎవరంటే?

ABN , First Publish Date - 2022-10-07T22:15:18+05:30 IST

బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాట్స్కీ(Ales Bialiatski)తోపాటు రష్యన్ మానవహక్కుల సంస్థ ‘మెమోరియల్’(

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఎవరంటే?

స్టాక్‌హోం: మానవ హక్కుల కోసం ఉద్యమించిన బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బియాలియాట్స్కీ(Ales Bialiatski)తోపాటు రష్యన్ మానవహక్కుల సంస్థ  ‘మెమోరియల్’(Russian human rights organisation Memorial), ఉక్రెయిన్‌ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్జీస్’(Center for Civil Liberties)కు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ఈ మేరకు నోబెల్ కమిటీ(Nobel Committee) ప్రకటించింది. అలెస్ మానవ హక్కుల కోసం పోరాడుతుండగా, మానవ హక్కుల కార్యకర్తలు 1987లో రష్యాలో ‘మెమోరియల్’ అనే సంస్థను స్థాపించారు. అలాగే, మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ లిబర్జీస్ సంస్థను స్థాపించారు. 


ఈ సంస్థలు, అలెస్ వారి వారి దేశాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తున్నట్టు నోబెల్ కమిటీ తెలిపింది. ఉక్రెయిన్, రష్యాకు చెందిన సంస్థలు ఆయా దేశాల్లో యథేచ్ఛగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు పేర్కొంది. సమాజంలో శాంతి, ప్రజాస్వామ్యం కోసం ఆ సంస్థలు పోరాడుతున్నట్టు వివరించింది. నోబెల్ బహుమతి ప్రకటన వైద్యశాస్త్రంతో మొదలైంది. ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్య రంగంలో వరుసగా విజేతల పేర్లను నోబెల్ కమిటీ ప్రకటించింది. విజేతలకు 10 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (దాదాపు 9 లక్షల డాలర్లు) అందజేస్తారు ఈ ఏడాది డిసెంబర్‌ 10న జరిగే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డు అందజేస్తారు.  

Updated Date - 2022-10-07T22:15:18+05:30 IST