ఇండియన్ ఎంబసీ మద్దతు లేదు: ఉక్రెయిన్‌ ఆసుప్రతి నుంచి భారతీయుడు

ABN , First Publish Date - 2022-03-04T22:47:44+05:30 IST

తన స్నేహితులతో కలిసి ఫిబ్రవరి 27న బయటికి వెళ్తుండగా చెక్‌పాయింట్ వద్ద తాము ప్రయాణిస్తున్న క్యాబ్‌పై కాల్పులు జరిగాయని, ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ తన భుజానికి తగిలిందని హర్‌జోత్ చెప్పుకొచ్చాడు. అప్పటికే పరిస్థితిని ఊహించి తాము వెనక్కి మళ్లామని చెప్పినప్పటికీ తమ వాహనంపై..

ఇండియన్ ఎంబసీ మద్దతు లేదు: ఉక్రెయిన్‌ ఆసుప్రతి నుంచి భారతీయుడు

కీవ్: రష్యాన్ సైనికుల దాడిలో భుజానికి బుల్లెట్ తగిలి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో చికిత్స పొందుతున్న హర్‌జోత్ సింగ్ అనే వ్యక్తి ఆ దేశంలోని భారతీయ ఎంబసీపై విమర్శలు గుప్పించాడు. ఎంబసీని ఎన్ని సార్లు సంప్రదించినా, ఎంత మొర పెట్టుకున్నా ఎలాంటి సహాయం అందడం లేదని, ఇప్పుడైతే సహాయం అందించలేమంటూ ప్రతిరోజు ఒకే సమాధానం చెప్తున్నారని అతడు అన్నాడు.


తన స్నేహితులతో కలిసి ఫిబ్రవరి 27న బయటికి వెళ్తుండగా చెక్‌పాయింట్ వద్ద తాము ప్రయాణిస్తున్న క్యాబ్‌పై కాల్పులు జరిగాయని, ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ తన భుజానికి తగిలిందని హర్‌జోత్ చెప్పుకొచ్చాడు. అప్పటికే పరిస్థితిని ఊహించి తాము వెనక్కి మళ్లామని చెప్పినప్పటికీ తమ వాహనంపై బుల్లెట్ల వర్షం కురిసిందని పేర్కొన్నాడు. చాలా సమయం తర్వాత ఆసుపత్రిలో కళ్లు తెరిచానని, అప్పటి వరకు తాను బతికున్న విషయం తనకే తెలియదని అన్నాడు. తనకు బతకాలని ఉందని, భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలని, కనీసం తనకు వీల్‌చైర్‌తో పాటు కొన్ని డాక్యూమెంటేషన్ లాంటి సహాయం సత్వరమే అందించాలని హర్‌జోత్ కోరాడు.

Read more