సరగేట్‌ తల్లికి మూడేళ్ల ఆరోగ్య బీమా తప్పనిసరి

ABN , First Publish Date - 2022-06-24T07:37:34+05:30 IST

అద్దెగర్భం(సరగసీ) ద్వారా సంతానం కోరుకునే జంట సరగేట్‌ తల్లికి విధిగా 36 నెలల పాటు ఆరోగ్య బీమా తీసుకోవాలి.

సరగేట్‌ తల్లికి మూడేళ్ల ఆరోగ్య బీమా తప్పనిసరి

అమల్లోకి సరగసీ నియంత్రణ నిబంధనలు

న్యూఢిల్లీ, జూన్‌ 23: అద్దెగర్భం(సరగసీ) ద్వారా సంతానం కోరుకునే జంట సరగేట్‌ తల్లికి విధిగా 36 నెలల పాటు ఆరోగ్య బీమా తీసుకోవాలి. ప్రసవం, అనంతరం తలెత్తే ఆరోగ్య సమస్యలకయ్యే ఖర్చులన్నింటినీ భరించేలా బీమా మొత్తం ఉండాలని సరగసీ(నియంత్రణ) నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఆ ఖర్చులన్నీ భరిస్తామని అద్దెగర్భాన్ని కోరుకునే జంట అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను సోమవారం నోటిఫై చేసింది.   

Updated Date - 2022-06-24T07:37:34+05:30 IST